
Shivam – The Spirit Of Gaami lyrics written by Sri Mani, sung by Shankar Mahadevan and composed by Naresh Kumaran
Shivam – The Spirit Of Gaami lyrics In Telugu
నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు కదా
హే మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివమ్
శివమ్ శివమ్ శివం
నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర
నీతో నిను వెతికేది
నీలో నిను కలిపేది
అన్వేషణ నీ కొరకను
సంఘర్షణ ఆది ఇది
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
ఈ లోకానికే నిను తాకే హక్కేదో లేకుందిరా
నీ సహనానికే అది తీర్చే చుక్కాని దొరికిందిరా
నీ నిన్నల్లోని గాయాలే నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న మరణాన్ని చెరిపెయ్యరా
జీవం నీలోనే ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెళ్ళి మోక్షాగామివవ్వరా
చావైనా సిద్ధం శివమ్
ప్రాణంకై యుద్ధం శివమ్
నీలానికి సంకెల శివమ్
శివమ్ శివమ్ శివం
బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర
ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో
ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో
లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి
మోక్షగామివవ్వరా
హే మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువుకే రక్షే శివం శివం
శివమ్ శివమ్ శివమ్
హరహర హరహరా
హరహర హరహరా
Shivam – The Spirit Of Gaami lyrics Video
Shivam – The Spirit Of Gaami Song Credits:
Singers: Shankar Mahadevan
Music Directors: Naresh Kumaran
Lyrics: Sri Mani (SriMani, Shree Mani)
Movie: Gaami
Label: Aditya Music
Note: If you find any mistakes in these lyrics, please feel free to contact us or leave a comment below. We would be more than willing to make the necessary corrections.
మీరు ఈ లిరిక్స్లో ఏవైనా తప్పులు కనుగొంటే, దయచేసి దిగువన కామెంట్ చేయడానికి సంకోచించకండి. మేము అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాము.