
Manava O Manava Song Lyrics: Manava O Manava Song | మానవా ఓ మానవా Song is the Latest Christian song of 2024. Manava O Manava Song Lyrics,Tune ,Produced by Bandela Naga Raju, sung by Vagdevi and Music by Suresh
Manava O Manava Song Lyrics | మానవా ఓ మానవా Song Lyrics In Telugu
మానవా… ఓ.. మానవా..
నువు చేసే పాపములు మానవా.. ! (2)
నీకై నాకై మరణించెను యేసు..
మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు …(2)
కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు….(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు…
ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు…(2)
నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా… ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా…(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
కొన్ని దినములేరా నీకు సమయమున్నది…
ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా
అయినా కాని నీవు మారవురా (2)