KARUNINCHUMA Krupachupuma song lyrics: KARUNINCHUMA Krupachupuma was presented by Wellspring Worship, Produced by Daniel Muchumarri. KARUNINCHUMA Krupachupuma song lyrics penned by Daniel Muchumarri, sung by Sireesha Baghavathula and music by Bro KY Ratnam.
KARUNINCHUMA Krupachupuma song lyrics In Telugu
కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద
నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా || 2 ||
నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ
కృపాసత్యములను వర్షమువోలె
ఆకాశమునుండి కురిపించితివా
దుష్టుల నోళ్లను కడతేర్చితివా || 2 ||
|| కరుణించుమా ||
సింహముల మధ్యను నా ప్రాణముండగ
ఏ అపాయమును దరిచేరకుండగ
నీ ప్రభావమును కనుపరచితివా
ఆకాశముకంటె అత్యున్నతుడా || 2 ||
|| కరుణించుమా ||
చిక్కించుటకై వలయొడ్డియుండగ
నా అడుగులను చిక్కుకొనకుండా
వేటగాని వలనుండి తప్పించితివా
రక్షకుడవై నన్ను కాపాడితివా || 2 ||
|| కరుణించుమా ||
నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది
మహోన్నతమైన నా దేవునికి
స్వరమండలముతో స్తుతిచేసేదా
సీతారానే వాయించేదా || 2 ||
|| కరుణించుమా ||
Disclaimer: The lyrics presented here are solely for personal and educational use and belong to their respective owners. Kindly note that they are protected under copyright law. Thank you for respecting the rights of the original creators.