Evaru Lere (ఎవరు లేరే) Song Lyrics – NEW TELUGU CHRISTIAN SONG 2024 

Evaru Lere (ఎవరు లేరే) Song Lyrics

ఎవరు లేరే నన్ను వెదకి నీవచ్చావే (2)
తప్పిపోయా నాకు తెలియకుండానే
జాడే లేక నేను అదృశ్యమయ్యానే

నావారే కుటుంబమై కలసిన వేళలో
నే దూరం lవెళ్లిపోయానే
నా స్నేహితులందరూ నా చుట్టూ ఉన్ననూ
ఒంటరిగా మిగిలిపోయానే (2)

ఊహించలేదు నువ్వొస్తావని
ఒంటరితనము తీసి నన్ను మోస్తావని

ఆశలు ఎన్నెన్నో ఆశయాలు ఉన్నను
అవి నాలో పాతిపెట్టానే
తిరిగి లేచి నడచినాను మళ్ళి పడిపోయాను
శోకంలో విరిగిపోయానే (2)

అద్భుతంగా వొచ్చావు కౌగిలించుకున్నావు
పడిన నన్ను లేవనెత్తి ఆదరించావు

నా వేదనలన్నిటిలో కలత చెందినప్పుడు
బహుగానే చెలించిపోయానే
నాపై యిలా విమర్శలు వచ్చిన వేళలో
పూర్తిగా కృంగిపోయానే (2)

పరమ వైద్యుడవై గాయాన్ని కట్టావు
నాబాధను తొలగించి స్వస్థపరిచావు

యేసయ్యా …. నన్ను వెదకి నీవచ్చావే (2)
మునిగిపోయా నీ ఆనాది ప్రేమలో
జీవించెద నీలో నిన్ను కీర్తించుటకే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top