Duggu Duggu Bulleto Song Lyrics – Telugu Folk Wedding Song 2024

Duggu Duggu Bulleto Song Lyrics

Duggu Duggu Bulleto Song Lyrics: “Duggu Duggu Bulleto” is the latest Telugu folk song of 2024 featuring Jayathi and Ashish Gandhi as the gorgeous wedding couple. With high-energy folk dance moves, this track brings alive the essence of celebration in a traditional Telugu wedding. The music by Bhole Shavali and vocals by Varam add to the joy and vibrance of the song. Set against grand wedding sets, this song beautifully blends modern and classic folk vibes, making it a must-watch for fans of folk music and the latest Telugu hits.

Duggu Duggu Bulleto Song Lyrics In Telugu

ముద్దబంతి ముద్దుగుమ్మ సద్దిబువ్వ లెక్కున్నవే
సక్కనైన చందురూడు నిన్నే నిన్నే కోరే కోరే

కట్నమొద్దు అంటివిరో సైదులో
నన్నే లక్షలు కోట్లానుకున్న మగనివో
కనుకలే వద్దంటివి సైదులో
నా మనసును మనువాడిన మొనగనివో

ఆస్తి పాస్తులొద్దంటివి సైదులో
నీ దోస్తీ నాకు ముద్దంటివి సైదులో
మూడు ముడ్లు వేసిన
నా ఏడు అడుగుల సైదులో

ఎక్కు రా ఎక్కు
అరె ఎక్కు రా ఎక్కుసైకిలో

తొక్కు రా తొక్కు సైదులో
నన్ను తోల్కపోయి దించారో
నా అత్తగారి ఇంటిలో

డుగ్గు డుగ్గు బుల్లెట్టొ లేకున్నా సైదులో
నీ ట్రింకు ట్రింకు సంపుడొచ్చే సైకిలే కిరాకు రో

ముద్దబంతి ముద్దుగుమ్మ సద్దిబువ్వ లెక్కున్నవే
సక్కనైన చందురూడు నిన్నే నిన్నే కోరే కోరే

నువ్వు పెట్టిన బొట్టు సైదులో
అది బొట్టు కాదు వీడిపోని ఒట్టు రో
నువ్వు నాకు తొడిగిన మెట్టెలు సైదులో
నీ వెంట తోడు నడిచే ప్రతి మెట్టురో
నువ్వు కట్టిన తాళి బొట్టు రో
నీ పసుపు గడపకే కుంకుమ బొట్టు రో
నీ మూడు ముడ్లు ఏడు అడుగుల
నాకు ఉడుం పట్టు రో

ఎక్కు రా ఎక్కు
అరె ఎక్కు రా ఎక్కుసైకిలో

తొక్కు రా తొక్కు సైదులో
నన్ను తోల్కపోయి దించారో
నా అత్తగారి ఇంటిలో

డుగ్గు డుగ్గు బుల్లెట్టొ లేకున్నా సైదులో
నీ ట్రింకు ట్రింకు సంపుడొచ్చే సైకిలే కిరాకు రో

అప్పగింతల కళ్ళ నీళ్ళకో
సంబరాల సంతకమే అయితివో
అత్తమామ లే అమ్మ నయినా అని
మెట్టినిల్లే పుట్టినిల్లు చేస్తివో
బాధల్లో నువ్వే నేనంటివో
కష్టాల్లో కౌగలించుకుంటివో
ఎంబటి నువ్వుంటే చాలు
అంబలి పరవన్నామో

ఎక్కు రా ఎక్కు
అరె ఎక్కు రా ఎక్కుసైకిలో

తొక్కు రా తొక్కు సైదులో
నన్ను తోల్కపోయి దించారో
నా అత్తగారి ఇంటిలో

డుగ్గు డుగ్గు బుల్లెట్టొ లేకున్నా సైదులో
నీ ట్రింకు ట్రింకు సంపుడొచ్చే సైకిలే కిరాకు రో

ముద్దబంతి ముద్దుగుమ్మ సద్దిబువ్వ లెక్కున్నవే
సక్కనైన చందురూడు నిన్నే నిన్నే కోరే కోరే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top