“DEEVINCHUMU DEVA | దీవించుము దేవా” Song Info
, P.S.Joanny
DEEVINCHUMU DEVA – దీవించుము దేవా Lyrics
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము యెంతో గొప్పది
నీ సంకల్పము యెంతో గొప్పది
నీ అనురాగము యెంతో గొప్పది
నీ సంకల్పము యెంతో గొప్పది
నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని వుంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును