Amarudavu Neevu Naa Yesayya Song Lyrics: – Latest Telugu christian Songs
Amarudavu Neevu Naa Yesayya Song Lyrics In Telugu
అమరుడవు నీవు నాయేసయ్యా – ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే – ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక – సాగిపోదును – సీయోను మార్గములో
స్తోత్రగీతము – ఆలపింతును – నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
శక్తికి మించిన సమరములో – నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ – ఉన్నత కృపతో నను నింపుటకే (2)
ప్రతి విజయము నీకంకితం – నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు – దూరమైనను – ననే చేరదీసెదవు
దేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు ||అమరుడవు||
వేకువకురిసిన చిరుజల్లులో – నీకృప నాలో ప్రవహించగా –
పొందితినెన్నో ఉపకారములు – నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును – మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ – నన్ను కాచి – కన్నీరు తుడిచితివి
కమ్మనైన – ప్రేమ చూపి – కనువిందు చేసితివి ||అమరుడవు||
జల్దరు వృక్షమును పోలిన – గుణశీలుడవు నీవేనయ్యా –
మరణము గెలిచిన పరిశుద్ధుడవు – పునరుత్థానుడవు నీవయ్యా(2)
జయశీలుడవు నీవేనని – ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో – నిండినావు – నీకే ఆరాధన
ఆత్మదీపము – వెలిగించినావు – నీకే ఆరాధన ||అమరుడవు||
Disclaimer: The lyrics presented here are solely for personal and educational use and belong to their respective owners. Kindly note that they are protected under copyright law. Thank you for respecting the rights of the original creators.